తెలుగు | English

దేశ ప్రజల తలసరి ఆదాయం పెరగలేకపోవటానికి రాజకీయ వ్యవస్థే ముఖ్య కారణం.

2016-11-25 6251


మన దేశంలో పాత కాంట్రాక్ట్ విదానాన్ని రద్దుచేసి నూతన కాంట్రేక్టు విదానాన్ని తీసుకువస్తాం.

మన దేశంలో పాత కాంట్రాక్ట్ విదానాన్ని రద్దుచేసి నూతన కాంట్రేక్టు విదానాన్ని తీసుకువస్తాం. ఈ నూతన కాంట్రాక్ట్ విదానం ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యెక్క కాంట్రాక్ట్ పనులు జరుగును. ఈ నూతన కాంట్రాక్ట్ విదానంలో ప్రజా రక్షణ కమిటీలను ఏర్పాటు చేసి ఈ ప్రజా రక్షణ కమిటీలకే ప్రదమ కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సబ్ కాంట్రాక్టర్లుగా ప్రజా రక్షణ కమిటీల ద్వారా మాత్రమే ఎంత పెద్ద సంస్దలైనా అనుమతి పొందవలసి ఉంటుంది.

ఉదా :- రైల్వే కాంట్రాక్టులు

ఇలా ఏవైనా కావచ్చు మెదటి కాంట్రాక్టరుగా ప్రజా రక్షణ కమిటీకే అదికారాలు ఇవ్వబడును. సబ్ కాంట్రాక్టర్లుగా ప్రజా రక్షణ కమిటీల ద్వారా మాత్రమే ఎంత పెద్ద సంస్దలైనా అనుమతి పొందవలసి ఉంటుంది.

ఈ నూతన కాంట్రాక్ట్ విదానం వలన దేశంలో ప్రతిభకు తగిన ఉపాదిని కల్పించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ఉదా :- బ్యాంకు ఎ.టి.యెం మిషన్స్

ఇలా అన్ని రంగాల వారికి ఈ ప్రజా రక్షణ కమిటీ ద్వారా ఉపాది అవకాశాలు కల్పించవచ్చు. దీని వలన ప్రతి ఒక్కరు ప్రతిభకు తగిన ఉపాదిని పొంది వారియెక్క తెలివితేటలతో మన దేశాన్ని అభివృద్దిలోనికి తీసుకవెళ్ళే అవకాశాలు ఉంటాయి.

ప్రజా రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తాం.

ప్రజా రక్షణ కమిటీ అంటే: ఓటు హక్కు ఉన్న ప్రతీ పౌరుడి నిరంతర పర్యవేక్షణలో మన దేశ ప్రజా స్వామ్య హక్కులను ప్రజాస్వామ్య బద్దంగా దేశ ప్రజలందరికీ అందించడమే ప్రజారక్షణ కమిటీ ముఖ్య ఉధ్దేశం.

1. ప్రతీ చిన్న గ్రామానికి ఒక ప్రజా రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తాం.

2. పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఒక ప్రజా రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తాం.

3. ఒక ప్రభుత్వ అధికారికి ఏ విధంగా జవాబుదారి తనంతో అధికారాలు వున్నాయో అదే విధంగా ప్రజా ప్రతినిధులకు కూడా జవాబుదారి తనంతో కూడిన హక్కులను కలిగి వుండే విధంగా నూతన చట్టాన్ని తీసుకు వస్తాం. ఆ చట్టం పేరే ప్రజా రక్షన కమిటీ.

4. ప్రజా రక్షణ కమిటీలు అంటే పెట్టుబడి లేని భారతదేశ ఆర్దిక వ్యవస్దలుగా అబివృద్దిపరచడమే ఈ ప్రజారక్షణ కమిటీ ముఖ్య ఉధ్దేశం.

5. ప్రజా రక్షణ కమిటీ పరిదిలో గల విఙ్నానవంతులు, మేధావులు, తెలివితేటలు కలిగిన వారిని గుర్తించి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి మా నూతన పార్టీ దేశ ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది.