తెలుగు | English

నల్ల ధనం, కరప్షన్ ధనం, ఫేక్ ధనం మన దేశంలో పెరగటానికి రాజకీయ వ్యవస్థే ముఖ్య కారణం.

2016-11-25 5833


గంటల్లో నల్ల ధనం, అవినీతి సొమ్ము మరియు దొంగ నోట్లు అరికట్టవచ్చు

నల్ల ధనం, అవినీతి సొమ్ము మరియు దొంగ నోట్లు ఈ మూడు కారణాలు ఒక పెద్ద సమస్య. ఈ మూడు కారణాల వల్ల ప్రతి దేశం ఆర్దికంగా ఎంతో నష్టపోతుంది. అందుకే ఆ దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణాలలో అభివృద్ది కనబడలేదు. అందుకే మేము మూడు విధానాలను ఆలోచించాము.

ఒకటి మరియు రెండవ విధానాన్ని ప్రభుత్వం అములు చేస్తుంది. మూడవ విదానం ప్రజా సహకారంతో అమలు చేసే విధానం.

ఒకటొవ విధానం ఆలోచన :- ఏ దేశంలోనైనా ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉన్న ప్రాంతంలో మాత్రమే ఒకే ఒక్క బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే డబ్బుని దాచుకొనుటకు వీలు కల్పించాలి. బ్యాంక్ నుండి డబ్బు తీసుకోవడానికి ఎన్ని బ్యాంకుల ద్వారానైనా వీలు కల్పించాలి.

ఉదా :- ఏ దేశంలోనైనా ప్రతి పౌరుడికి దేశం మొత్థం మీద ఎస్.బి.ఐ, అంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఒఫ్ ఇండియా ఇలా మొదలగు బ్యాంక్ అకౌంట్లు ఎక్కువగా కలిగి వుంటే, ఈ విధానాన్ని రద్ధు చేసి ప్రతి ఒక పౌరుడికిఓటు హక్కు ఉన్న ప్రాంతంలో మాత్రమే ఒకే ఒక్క బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఈ నూతన విధానం వలన నల్లధనం, అవినీతి సొమ్ము మరియు దొంగ నోట్లు అరికట్టవచ్చు.

రెండవ విదానం :- ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రజల ఆస్తులను సర్వే చేయాలి.

భారతదేశంలో చాల మంది వైట్ మనీ పేరుతో సాగు భూముల మీద పెట్టుబడులు పెట్టుచున్నారు. అందుకే ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రజల ఆస్తులను సర్వే చేయాలి.

ఉదా :- గ్రామంలోని 100 ఎకరాలలో 80 ఎకరాలు ప్రభుత్వానిది, ప్రజలది అయితే వాటి వివరాలు ఆదాయ శాఖకు తెలియపరుచుటవలన మిగిలిన 20 ఎకరాలు ఎవరివి అనేవి తెలుసుకోవటానికి ఆదాయ శాఖకు సులభం అవుతుంది. ఈవిధానం వలన గ్రామాలలో మిగిలిన 20 ఎకరాల భూమిని ఆదాయ శాఖ గడువుతో కూడిన ఉత్తర్వులు జారీ చేస్తుంది. గడువు తేదేలోగా ఎవరు హక్కుదారులు రాకపోతే ఆమిగిలిన భూమి ఆ గ్రామానికే ఉపయెగించుకోవడానికి ప్రభుత్వం అనుమతితో వీలు కలుగుతుంది. ఇదే విదంగా ఆ గ్రామంలో ఇల్లుల, కంపెనీలు, వ్యాపారాలు ఇలా ఏవైనా కావచ్చు. వాటి లావాదేవీలు ఆదాయశాఖకు తెలియపరచాలి. లేనిచో పైన తెలిపిన విదంగా ప్రభుత్వం గడువుతో కూడిన ఉత్తర్వులతో సొంతం చేసుకోవాలి.

మూడవ విదానం : - భారతదేశంలో నివశించు ప్రతి ఒక్కరు స్వచ్చంధంగా సంవత్సరానికి ఒక్కసారి వారి ఆస్తుల లావాదేవీలు ఆదాయశాఖకు తెలియపరుచుట వలన నల్ల ధనం, అవినీతి సొమ్ము మరియు దొంగ నోట్లు అరికట్టవచ్చు.