తెలుగు | English

ప్రవాస భారతీయులు చేసిన సేవలు వృధా కాకుండా వుండాలి.

2016-11-25 6222


ప్రవాస భారతీయులకు మా నూతన పార్టీ ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటుంది.

అది ఏమిటంటే భారతదేశానికి మీరు ఏదైనా సహాయ సహకారాలు అందించాలనుకుంటే దయచేసి నేరుగా మీ సహకారాన్ని అందించండి లేదా ఒక కమిటీగా ఏర్పడి ఆందులో కొందరిని పంపించి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది పూర్తి చేసి వెళ్లండి. దీన వలన మీ ఆశయం నెరవేరును దేశానికి మంచి జరుగును. మా నూతన పార్టీ ఎందుకు మీక ఈ విదంగా తెలియపరుస్తుంది అంటే గత కొన్ని సంవత్సరాలుగా మన దేశానికి మీరు అందించే సహాయ సహకారాలు కొందరికి మాత్రమే అందుతున్నాయి. ప్రస్దుతం మన దేశం కొత్త టెక్నాలజీతొ అభివృద్ధి జరుగుతుంది. మీరు చేయవలసిన సహాయం నేరుగా కాకుండా ఒక కమిటీగా ఎర్పడి ఆ కమిటీ ఆదీనంలోనే మీరు మన దేశానికి చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు అప్పగించండి. దీని వలన మీ సహాయం పూర్తిగా మనదేశానికి అందుతుంది. మన దేశం అభివృద్ది  చెందుతుంది.

మానూతన పార్టీ మరొక విన్నపం..

దయచేసి మీసహాయం భారతదేశంలో చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పడానికి ఉండే విదంగా అండగా సహకరించండి. అంతేకాని మన దేశ ప్రజలు ఎదుటివారి సహాయం కోసం ఎదురుచూసే విదంగా ఉండకూడదు. దయచేసి నా విన్నపాన్ని అర్దం చేసుకుంటారని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.