తెలుగు | English

పరిశ్రమలు ఒక వ్యక్తికి సంభందించినవి కావు. దేశ ప్రగతిలో ఒక సంస్థ అని గుర్తించినప్పుడే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి.

2016-11-25 6099


కంపెనీ మూల దనం మరియు కార్మికులు శక్తిని కలిపి ఒక కంపెనీగా ఏర్పాటు చేస్తాం

భారతదేశంలో నూతన పరిశ్రమలు స్దాపించేవారు మరియు ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలు వారు ఎవరైనా కావచ్చు ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను బట్టి కార్మికులను ఉద్యోగస్తులను విదులలోనికి తీసుకుంటున్నారు. ప్రస్తుత కార్మిక చట్టాల వలన కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎన్నో సంవత్సరాల నుండి వారి యెక్క భవిష్యత్తు ఒక ప్రశ్నార్దకంగా ఉన్నది. లాబనష్టాల అంచనాల మీద ప్రతి పరిశ్రమ తనయెక్క విదులను నిర్వహించేది. ప్రస్దుతం మన దేశంలో ఎన్నో పరిశ్రమలు ఒక ప్రణాలికా బద్దంగా నడిపించడం లేదు. కొన్ని కంపెనీలు ఒక కంపెనీ మెత్తం పెట్టుబడి కన్నా బ్యాంకుల నుండి తీసుకున్న అప్పే ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఆ కంపెనీలు కొద్ది కాలంలోనే నష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇటువంటి కంపెనీల వలన కార్మికులు, ఉద్యోగస్తులు ఉపాది కోల్పోతున్నారు.

మా నూతన పార్టీ వస్తే ప్రజా రక్షణ కమిటీలను ఏర్పాటు చేసి ఈ ప్రజా రక్షణ కమిటీల ద్వారానే ఏ కంపెనీ అయిన కార్మికులను కానీ ఉద్యోగస్తులను కానీ తీసుకోవాలి అంటే ఈ ప్రజా రక్షణ కమిటీ అనుమతి తప్పక తీసుకోవలసి ఉంటుంది.

మా నూతన పార్టీ కార్మిక చట్టాలలో కొన్ని మార్పులు చేసి ఇటు కార్మికులు అటు పరిశ్రమలు నష్టపోకుండా నూతన కార్మిక చట్టాన్ని అమలు పరుస్తుంది.

ఉదా. కంపెనీ మూల దనం మరియు కార్మికులు శక్తిని కలిపి ఒక కంపెనీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కంపెనీ ఆర్దిక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పుడు కంపెనీ వ్యవస్దాపకులు సొంత నిర్ణయం తీసుకొనడానికి వీలు ఉండదు. ఈ కంపెనీలో కార్మికులకు కూడా అంతే బాగం హక్కులు కల్పించడం జరుగుతుంది. వీరిద్దరి బాగస్వామ్యంతోనే ఏకంపెనీ అయినా నడపబడుతుంది.

ఉదా. ఒక కంపెనీలో పెట్టుబడి 1 నుండి ఎన్ని సంవత్సరాల లోపు అయినా పెట్టుబడులు మెత్తం కంపెనీకి వస్తే, ఆ వచ్చె సంవత్సరాల నుండి కంపెనీ పెట్టుబడులలో 50శాంతం వాటా కార్మికులకు సొంతం అవుతుంది. కంపెనీ యాజమాన్యం కంపెనీ నడపడం ఇష్టం లేకపోతే ఇతరులకు అప్పచెప్పాలనుకున్నపుడు 50 శాతం వాటా మాత్రమే కంపెనీకు హక్కులు కలిగే చట్టాలను తీసుకువస్తాం.

ఒక దేశం ఆర్దిక ఒడిదుడుకులను ఎదుర్కుంటున్నపుడు ఆదేశాన్ని ఆర్దికంగా నిలబడగలిగే శక్తిని ఇచ్చేది ఒకే ఒక్క వ్యవస్ద ఆ దేశ కార్మిక వ్యవస్ద. అంతే కానీ ఆదేశ పెట్టుబడిదారుల వ్యవస్ద వలన ఆ దేశ ఆర్దిక పరిస్దితి అబివృద్ది చెందుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఏది ఏమైనా గడచిన సంవత్సరాల కన్నా రాబోయే సంవత్సరాలలో ఏదేశ ఆర్దిక పరిస్దితినైనా అబివృద్ది పదంలో నడిపించగలిగే ఒకే ఒక శక్తి కార్మిక శక్తి. మా ఆలోచన ఒక్కటే, కార్మిక శక్తి దేశ మూల దనంగా మేము బావిస్తున్నాం. కార్మికులే బావి తరాలకు పూణాదులుగా నిలుస్తారు.

Copyrights 2016 © :నూతన జాతీయా పార్టీ