తెలుగు | English

ప్రజాధనం తప్పుదోవ పట్టడానికి రాజకీయ వ్యవస్థే ముఖ్య కారణం.

2016-11-25 4706


ఒక పౌరుడికి ఒక్క బ్యాంకు ఎకౌంట్ మాత్రమే ఉండాలి :

ప్రతి గ్రామంలో మరియు వార్డులలో బ్యాంకులను ఏర్పాటు చేస్తాం. ఈ బ్యాంకుల ద్వారానే భారతదేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడికి ఒక్క ఎకౌంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎకౌంట్ ద్వారానే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు తన యెక్క ఆర్దిక లావాదేవీలు జరుగుతాయి. ఒక వ్యక్తికి ఎన్ని వ్యాపార సంస్దలు ఉన్న ఈ ఒక్క బ్యాంక్ ఎకౌంట్ ద్వారా మాత్రమే వాటి లావాదేవీలు జరుగుతాయి. ఈ బ్యాంకు ఎకౌంట్ నెంబరు ద్వారనే వారి యెక్క సొమ్మును దాచుకొనుటకు వీలు కలుగుతుంది. దేశంలో మరెక్కడ వీరికి రెండవ బ్యాంక్ ఎకౌంట్ ఇవ్వడం జరగదు.

ఈవిదానం వలన భారతదేశంలో బ్లాక్ మనీ, కరెప్షన్ మనీ, ఫేక్ మనీని పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు దేశ సంపదను ప్రపంచ దేశాలకు తరలించడానికి కూడా అవకాశం ఉండదు. దీనివలన దేశ ఆర్దిక వ్యవస్ద ఎప్పటికి ఉడిదుడుకులను ఎదుర్కొనవలసిన అవసరం ఉండదు. అంతేకాదు ప్రస్దుతం మనదేశంలో కానీ ప్రపంచ దేశాలలో కానీ లెక్కకు రానీ సొమ్ము అంతయు అతి తక్కువ సమయంలో తెలుసుకోవడానకి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రతీ చిన్న గ్రామానికి ఒక బ్యాంకు ఏర్పాటు చేస్తాం. పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఒక బ్యాంకు ఏర్పాటు చేస్తాం. ఈ బ్యాంకుల పరిరక్షనను నిరుద్యోగులకు అప్పజెప్పడం జరుగుతుంది.