తెలుగు | English

ప్రజా ప్రతినిధి అంటే అర్ధం ధనాన్ని పోగుచేసినవాడు కాదు. ప్రజలను రక్షించేవాడు అని అర్ధం.

2016-11-25 7171


ఎంపీలు, ఎమ్మెల్లేలు, ఎమ్మెల్సీలు ఇలా ఏ ప్రజా ప్రతినిదులైనా కావచ్చు. మా నూతన పార్టీ వస్తే ఈ క్రింది విదంగా వారియెక్క విదులు ఉంటాయి.

1. కేంద్ర రాష్ట్రాల యెక్క ఆదాయంలో ఎంపి నిదులు అని కానీ ఎమ్మెల్యే నిదులు అని కాని ఇక ఉండవు.

2. కేంద్ర రాష్ట్రాల యెక్క ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన మేము ఏర్పాటు చేయబోయే ప్రజా రక్షణ కమిటీల యెక్క బ్యాంకు ఖాతాలో జమ చేయబడును.

3. ప్రజా ప్రతినిదులు ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్న మేము ఏర్పాటు చేయబోయే ప్రజా రక్షణ కమిటీ యెక్క బ్యాంకు ఎకౌంట ద్వారా మాత్రమే ఖర్చు చేయాలి.

4.ప్రజా ప్రతినిదులు ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్న ప్రజా రక్షణ కమిటీ యెక్క ఆమోదం తప్పనిసరిగా ఉండాలి.

5.ఎంపీలు, ఎమ్మెల్లేలు ప్రజా రక్షణ కమిటీ యెక్క తీర్మానాన్ని తప్పక ఆమోదించాలి.

6. ఎంపీలు, ఎమ్మెల్లేలకు కేంద్ర రాష్ట్రాలలో అన్ని మంత్రి శాఖల అదికారాలు ఇవ్వడం జరుగును.

7. కేంద్ర రాష్ట్రాలలో గల మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్లేల యెక్క నిర్ణయాలను తప్పక ఆమోదించాలి. ఒక వేళ ఆమోదించకపోయిన ఆ బిల్లు ప్రజారక్షణ కమిటీ యెక్క ఆమోదంతో పూర్తిగా అమలు అవుతుంది.