తెలుగు | English

భారత ఆహార సంస్దలను ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తే ఆహార ధాన్యాల కొరత ఉండదు.

2016-11-25 5149


మనదేశంలో భారత ఆహార సంస్దలు ప్రతీ సంవత్సరం ఆహార దాన్యాల మీద ఎన్నో కోట్ల రూపాయిలు పెట్టుబడులు పెట్టి ఆహార నిల్వలు చేస్తుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మన దేశ ఆహార సంస్దలలో ఆహార దాన్యాలు నిల్వ ఉంచడానికి ట్రాన్స్ పోర్టింగ్ విదానం వలన ఎంతో సొమ్ము వృదా అవుతుంది. దీని వలన మన దేశంపై ఆర్దికంగా కొంత బారం పడుతుంది. ఆహార దాన్యాల నిల్వలకు మా నూతన పార్టీ ఒక నూతన విదానాన్ని తీసుకువస్తుంది. అది ఏమిటంటే ప్రతీ గ్రామంలో ప్రతీ వార్డులలో ఆహార దాన్యాల గిడ్డంగులను ఏర్పాటు చేస్తాం. వీటి నిర్వహణ బాద్యతలు ప్రతీ పౌరునికి అప్పచెపుతాం ఈ విదానం వలన ఆహార నిల్వల పరిస్దితి తేలుసుకోవడమే కాకుండా ఆర్దికంగా కొంత లాబం ఉంటుంది. కొంత మంది పౌరులకు ఉపాది కలుగుతుంది.