తెలుగు | English

మన దేశంలో అనంతమయిన వనరులు వున్నా వాటిని మనం వినియోగించుకోలేకపోవటానికి రాజకీయ వ్యవస్థే ముఖ్య కారణం

2016-11-25 5152


మన భారతదేశంలో వనరులు అనంతం. మన దేశ వనరులను పూర్తిగా వినియోగించుకోవలేకపోతున్నాం. దీనికి ప్రదాన కారణం కొందరు వ్యక్తల ఆదీనంలోనే అనంతమైన మన దేశ వనరులు ఉన్నాయి. దీనికి మూలం మన దేశ పరిపాలన వ్యవస్దలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను మనం ఇప్పటికైనా గుర్తించలేకపోతే అనంతమైన వనరులు ఉన్న మన దేశం ఎప్పటికి అభివృద్ది కోసం ఎదురు చూస్తూ ఉండవలసి ఉంది.

మా నూతన పార్టీ అదికారంలోకి వస్తే మన దేశంలో ఉన్న వనరులను గ్రామాల వారీగా వార్డుల వారీగా విబజించి ప్రజా రక్షణ కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీలకే మెదటి లీజు విదానాన్ని అమలులోనికి తీసుకువస్తాం.

ఈవిదానం వలన పెట్టుబడి లేని ఆర్దిక వ్యవస్దలుగా ప్రజా రక్షణ కమిటీలు భలోపితమవుతాయి. ఈ ప్రజా రక్షణ కమిటీలే దేశ ఆర్దిక ప్రగతికి మూలం అవుతాయనడానికి ఎటువంటి సందేహం లేదు.

ఉదా. భగర్బ జలాలు

ఇలా మెదలగు ఏవైనా కావచ్చు మెదటి లీజు ఈ ప్రజా రక్షణ కమిటీలకే ఇవ్వడం జరుగుతుంది. ఈ కమిటీల ద్వారానే సబ్ లీజుకు ఎంత పెద్ద సంస్దలైనా పొందవలసి ఉంటుంది.

ప్రజా రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తాం.

ప్రజా రక్షణ కమిటీ అంటే: ఓటు హక్కు ఉన్న ప్రతీ పౌరుడి నిరంతర పర్యవేక్షణలో మన దేశ ప్రజా స్వామ్య హక్కులను ప్రజాస్వామ్య బద్దంగా దేశ ప్రజలందరికీ అందించడమే ప్రజారక్షణ కమిటీ ముఖ్య ఉధ్దేశం.

1. ప్రతీ చిన్న గ్రామానికి ఒక ప్రజా రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తాం.

2. పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఒక ప్రజా రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తాం.

3. ఒక ప్రభుత్వ అధికారికి ఏ విధంగా జవాబుదారి తనంతో అధికారాలు వున్నాయో అదే విధంగా ప్రజా ప్రతినిధులకు కూడా జవాబుదారి తనంతో కూడిన హక్కులను కలిగి వుండే విధంగా నూతన చట్టాన్ని తీసుకు వస్తాం. ఆ చట్టం పేరే ప్రజా రక్షన కమిటీ.

4. ప్రజా రక్షణ కమిటీలు అంటే పెట్టుబడి లేని భారతదేశ ఆర్దిక వ్యవస్దలుగా అబివృద్దిపరచడమే ఈ ప్రజారక్షణ కమిటీ ముఖ్య ఉధ్దేశం.

5. ప్రజా రక్షణ కమిటీ పరిదిలో గల విఙ్నానవంతులు, మేధావులు, తెలివితేటలు కలిగిన వారిని గుర్తించి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి మా నూతన పార్టీ దేశ ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది.