తెలుగు | English

మన దేశంలో ఉచిత వైద్యం అందకపోవడానికి రాజకీయ వ్యవస్థే ముఖ్య కారణం.

2016-11-25 7567


మనం మన జీవన పరిస్దితులను బట్టి తయారు చేసుకున్న రూపాయి మానవ మనుగడనే శాసిస్తుంది.

మనం మన జీవన పరిస్దితులను బట్టి తయారు చేసుకున్న రూపాయి మానవ మనుగడనే శాసిస్తుంది. దీని మూలాన్ని మనం ఎందుకు కట్టడి చేయలేము. దీని మూలం రాజకీయ పరిపాలన వ్యవస్ద, ఈ రాజకీయ పరిపాలన వ్యవస్దను మన దేశ ప్రజలందరం ఒకటిగా ఉంటే మార్చగలం అనే నమ్మకం నాకు ఉన్నది.

మన దేశంలో పేద గొప్ప తేడా లేకుండా ఉన్నత ప్రమాణాలతో అత్యాదునిక వసతులతో వైద్యాన్ని దేశ ప్రజలందరికి అందించినప్పుడే మనం మన బావీతరాలు ఆరోగ్యంగా సుఖంగా జీవించగలము.

మా పార్టీ ముఖ్య లక్ష్యం భారతదేశంలో ప్రతీ ఒక్కరికి ఉచితంగా ఉన్నత ప్రమాణాలతో అత్యాదునిక వసతులతో కూడిన వైద్యాన్ని దేశ ప్రజలందరికి అందించడమే మాలక్ష్యం. ప్రస్దుతం ఉన్న ప్రైవేటు వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆదీనంలోకి తీసుకొని నడిపించడం జరుగుతుంది.

ప్రతి డాక్టర్ వ్రాసే మందుల చీటీ పైన వారు ఏ మందులు వ్రాస్తున్నారో రోగికి అర్దం అయ్యే విదంగా వ్రాయాలి. ఆ చీటీలో కంపెనీల పేర్లను రాయకూడదు. కేవలం ఏ మందు రాస్తున్నారో ఆ మందు కాంబినేషన్లను మాత్రమే రాయాలి.

ఉదా :- జ్వరానికి ---పేరాసిట్మాల్ మరియు జ్వరానికి ఏంటిబయోటిక్---సెఫిక్సమ్, సిప్రోఫ్లాక్సిన్, ఓఫ్లాక్సిన్ మెదలగునవి. ఇలా ఆ మందుల కాంబినేషన్లు మాత్రమే రాయాలి. కంపెనీ పేర్లను మాత్రం రాయకూడదు. నేను ఎందుకు ఇలా రాయమనడానికి గల కారణం, ప్రమాణాలు లేని మందులు మార్కెట్లోనికి రావడం వలన కొంతమంది డబ్బు కోసం ఈ మందులను వారి ప్రిస్కిప్షన్ లో రాయడం వలన వాటిని ప్రజలు వాడి ఆరోగ్యం మెరుగుపడక మరింతగా అనారోగ్యానికి గురి అవుతున్నారు.

మానూతన పార్టీ వస్తే భారతదేశంలో మందులను దేశప్రజలకు అందించడానికి మాప్రభుత్వమే సొంతంగా పరిశ్రమలను స్దాపిస్తుంది. దీనికి కావలసిన వనరుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో 125కోట్ల జనాభా కలిగిన మనం ప్రతి ఒక్కరి నుండి ఒక్క రూపాయి చొప్పున 365రోజులు వసూలు చేసిన ఒక సంవత్సరానికి 45625కోట్ల రూపాయిలు మందలు తయారీకి అందుబాటులోకి వస్తాయి. ఈ సొమ్మును షేర్ రూపంలో వసూలు చేసి ప్రజలయెక్క సొమ్ముకు భద్రత కల్పిస్తూ దేశంలోని ప్రతి ఒక్కరికి అవసరమైన మందులను ఉచితంగా అందించడానికి చాలా సులభం అవుతుంది. అనేది మాపార్టీ ఆలోచన.

ఒక రోగి యెక్క శారీరక పరిస్దితిని బట్టి ఏడాక్టరు అయిన మందులను రాసే విదంగా నూతన వైద్య విదానాన్ని తీసుకువస్తాం. దీనికి కావలసిన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచుతాం.

భారతదేశంలో తయారు అయ్యే మందుల యెక్క దరలను భారతదేశ ప్రభుత్వమే నిర్ణయించే చట్టాలను తీసుకువస్తుంది. ప్రైవేటు కంపెనీల పెట్టుబడులన్ని ఒక సంస్దగా ఏర్పాటు చేసి ఆసంస్ద ద్వారానే మందుల తయారీకి అనుమతి కల్పించి ఆసంస్ద యెక్క ద్వారానే మందుల దరలను ప్రకటించవలసి ఉంటుంది.

1. భారతదేశంలో జన్నించిన ప్రతి ఒక్కరికి పూర్తిగా ఉన్నత ప్రమాణాలతో ఉచిత వైద్యం అందించబడును.

2. ప్రతీ గ్రామంలో ఒక ఎ.ఎన్.ఎమ్.స్ర్తీలు మరియు ఒక హెల్త్ అసిస్టెంట్ (పురుషులు) ఒక లాబ్ టెక్నీషియన్, ఒక ల్యాబ్, ఆక్సిజన్ సిలిండర్, ఒక ఆంబులెన్స్, ఒక ఫార్మ్సిస్ట్, అత్యవసరానికి కావలసిన మందులు, 24గంటలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

3. పట్టణాలలో వార్డుల వారీగా ఒక ఎ.ఎన్.ఎమ్. మరియు ఒక లాబ్ టెక్నీషియన్, ఒక ల్యాబ్, ఆక్సిజన్ సిలిండర్, ఒక ఆంబులెన్స్, ఒక ఫార్మ్సిస్ట్, అత్యవసరానికి కావలసిన మందులు, 24గంటలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

4. ప్రతీ మండలానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం.

5. ప్రతీ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీను ఏర్పాటు చేస్తాం. ప్రస్దుత ప్రైవైటు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆదీనంలో నడిపిస్తాం.

6. ప్రతి మండలంలోను ఉన్నత ప్రమాణాలతో కూడిన పెరామెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తాం.

7. భారతదేశంలో ఉన్న ఆయుర్వేదిక్, హల్లోపతి, హోమియోపతీ ఈ మూడు మందులకు ఒక వ్యవస్ద ఏర్పాటు చేసి మానవ అవసరానికి తగిన మందులను మాత్రమే నూతన పద్దతుల ద్వారా బయటకు తీసుకొని వస్తాం.

8. ప్రస్దుతం నడుస్తున్న మందుల షాపులన్నింటిని ప్రభుత్వ ఆదీనంలో ఒక వ్యవస్దను ఏర్పాటు చేసి ఈ వ్యవస్ద ద్వారా మందులను విక్రయించడానికి అనుమతి కల్పిస్తాం