తెలుగు | English

వృద్దులు, వికలాంగులు, వితంతువుల జీవితాలలో వెలుగు చూడాలంటే ఒకటే మార్గం.

2016-11-25 6282


మా నూతన పార్టీ వస్తే ప్రతీ ఒక్క ప్రజా రక్షణ కమిటీలో వృద్దులకు వికలాంగులకు వితంతువులకు ఒక ఆశ్రమం నిర్మిస్తాం. ఈ ఆశ్రమం ద్వారా వీరికి అన్ని సౌకర్యాలు అందిస్తాం వీరు ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించడానికి గ్రామంలోని ప్రతి పౌరుడి సహకారంతో అన్ని సేవలు అందిస్తాం.

వికలాంగులు, వృద్దులు, వితంతువుల కుటంబాలకు బారం అనే ఆలోచన ఏఒక్కరిలో రాకుండా పూర్తి భాద్యతతో ప్రజా రక్షణ కమిటీ కట్టుబడే విదంగా ఒక బాద్యత వేస్తాం.

ప్రతి ఇంటిలో వృద్ధులు వృద్దాప్యంలో ఉన్నాం అనే ఆలోచన రాకుండా చూసుకునే భాధ్యత ఆ కుటుంభం పైన మరియు ప్రభుత్వాల పైన వున్నది. వీరికి మనందరి సహకారం తప్పనిసరిగా వుండాలి. వీరికోసం మన దేశంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలి.

కొత్త చట్టం ఏమిటంటే : ప్రతి ఇంటిలో ఎంతమంది సంపాదనపరులుంటే అంతమంది పిల్లల ఆదాయంలో 10% సొమ్ము తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేసేవిధంగా నూతన చట్టాలను తీసుకురావాలి. ఇదే విధంగా వికలాంగులు, వితంతువులు ఉంటే వీరి బ్యాంకు ఖాతాలో కూడా 10% జమ చేయాలి. ఈ పదకాన్ని అమలు చేయాలంటే కూలివాళ్ళు, కార్మికులు, ఉద్యోగస్తులు, మిగిలిన వాళ్ళు ఎవరయినా కావచ్చు వీరందరి ఆదాయాన్ని నగదురహిత పరిపాలన చేస్తే ఈ పథకం అమలుచేయడం చాలా సులభం అవుతుంది. దీనితో పాటు భారత ప్రభుత్వం కూడా కొంత సహాయాన్ని అందిస్తే మన దేశంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు జీవించివున్నంత కాలం ఇతరుల సహాయార్ధం కోసం ఎదురుచూడకుండా కొంత వరకు ఈ పథకం సహాయపడుతుంది.