తెలుగు | English

వ్యవసాయానికి కావలసినంత సాగు భూములు వున్నా ఆహార కొరతకు రాజకీయ వ్యవస్థే ముఖ్య కారణం.

2016-11-25 7495


మన దేశంలో వ్యవసాయానికి కావలసినంత అనుకూలమైన సాగు భూములు చాలా ఉన్యాయి. కానీ మనందరం మన దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో విఫలమయ్యాం. దీనికి ప్రదాన కారణం ఒక్కటే. మనదేశంలో వైట్ మనీ పేరుతో దనవంతులు సాగుభూములపై పెట్టుబడులు పెట్టి సాగుభూములను సాగు చేయకుండా ఉంచడం వలన ఆహార కొరత ఏర్పడటానికి ప్రదాన కారణం.
కౌవులదారు రైతులకు అందుబాటు ధరలో సాగుభూములు లేకపోవడం వలన కౌవులు చేయడానికి రైతులు ముందుకు రాలేకపోతున్నారు. ఒక వేళ వచ్చిన వారి కష్టపడి పండించిన పంట రాబడి కన్నా పెట్టుబడులకే ఎక్కువ ఖర్చు అవుచున్నాయి. దీనివలన మన దేశంలో రైతులు వ్యవసాయం చేయడానికి భయపడే పరిస్దితి ఏర్పడింది. ఇలాగే మనందంరం చూస్తూ ఉరుకుంటే భవిష్యత్తులో ఆహార దాన్యాల కోసం ప్రపంచ దేశాలపై ఆదారపడవలసిన పరిస్దితి వస్తుంది.
దేశ అభివృద్ది అంటే ఆహార భద్రత లేని దేశం కాదు. మన తాత్కాలికమైన అవశరాల కోసం ఉపయెగించే వాహనాలు, వినోదాల, ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇలా ఏవైనా కావచ్చు అవసరానికి మించి వినియోగించుకోవడం వలన దేశ అభివృద్ది ప్రస్దుతం కనబడిన భవిష్యత్తులో ఆహార భద్రత లేని ఏ దేశమైన అభివృద్ది సాదించలేదు.
మా నూతన ప్రభుత్వం వస్తే భూమి ఎవరిదైనా కావచ్చు ఆరు నెలలకు ముందుగా తమ భూమిలో ఏమి సాగు చేస్తారో ప్రభుత్వానికి తెలియపరిచే చట్టాన్ని అమలు పరుస్తాం. ఈ విదానం వలన దేశంలో సాగుకు పనికొచ్చే భూమి అంతా సాగులోనికి వస్తుంది. దీని వలన దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించడమే కాకుండా ప్రపంచ దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు కష్టపడి పండించే కౌలు రైతులకు భూమిని అందించడం సులబం అవుతుంది. ఈవిదానం వలన దేశంలో ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగి ప్రజలందరికి అందుబాటు ధరలలో లబిస్తాయి.

భారతదేశంలో ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్న వారు భూములను విక్రయించాలన్న కొనాలన్న నేరుగా రిజిస్ట్రేషన్ జరగదు.ఎందుకంటే వారి యెక్క భూమి తాలూకా డాక్యుమెంట్స్ పూర్తిగా మండల ఎగ్రికల్చర్ ఆఫీస్ పరిదిలో కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి భూమి కొని వ్యవసాయం లేకుండా భూమిని కాళీగా ఉంచినచో ఆ భూమి మీద పంట సమయంలో ఆ సంవత్సరం సర్వాదికారాలు మండల ఎగ్రికల్చర్ ఆఫీసుకి హక్కు కలిగి ఉంటుంది.

ఒక వ్యక్తి భూమిని కొని నిరుపయోగంగా ఉంచినచో ఆ భూమిని కవుల దారు రైతులకు మండల ఎగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా అందించడం జరుగుతుంది. భూమి గల వ్యక్తి సాగుచేయాలనుకుంటే 6నెలలకు ముందుగా మండల ఎగ్రికల్చర్ ఆఫీసు వారికి తప్పక తెలియపరచాలి.

భారతదేశంలో ప్రస్దుతం మిగిల ఉన్న భూమిని మెత్తం గ్రామాల వారీగా వార్డుల వారీగా విభజించి ఒక ప్రత్యేకమైన ఎగ్రికల్చర్ వ్యవస్దను ఏర్పాటు చేసి ఈ వ్యవస్ద ద్వారా దేశంలో భూములు ఎక్కడ సాగు లేకుండా ఉండటమే ఈ వ్యవస్ద యెక్క ముఖ్య ఉద్దేశం. అంతే కాదు కష్టపడి పనిచేసే కవులదారు రైతులకు ఈసంస్దలో ప్రదాన బాగం ఉంటుంది. కవుల దారు రైతులకు అండగా ఉండటమే ఈ నూతన ఎగ్రికల్చర్ వ్యవస్ద యెక్క లక్ష్యం.

ఈవిదానం వలన మనదేశంలో ఆహార ఉత్పత్తులు ఎంత వరకు ఉన్నాయో తెలుసుకోవడానికి సులభం అవుతుంది. అంతే కాదు రైతులకు కావలసిన విత్తనం ఎరువులు ఎంత వరకు అవసరమో తెలుసుకోవచ్చు మరియు విపత్తు సమయంలో ఎంత నష్టం కలిగిందో తెలుసుకోవడానికి సులభం అవుతుంది.

కవులదారు రైతులందరికి ప్రత్యేకమైన ఎగ్రికల్చర్ బ్యాంకింగ్ విదానాన్ని తీసుకువస్తాం. ప్రతి ఒక్క రైతు వారి పంటను గిట్టుబాటు దర వచ్చే వరకు ఈ బ్యాంకు ద్వారా పంటకు కావలసిన రూణాన్ని పొందే విదంగా ఏర్పాటు చేస్తాం. ఈ బ్యాంకుల ద్వారానే రైతులకు కావలసిన విత్తనం మరియు ఏరువులు, మోటార్లు, ట్రాక్టర్లు ఇలా ఏవైనా వ్యవసాయానికి అవసరమైన పరికరాలను అందించడం జరుగుతుంది.

కవులదారు రైతు విత్తనం నాటిన దగ్గర నుండి పంట గిట్టుబాటు ధర వచ్చే వరకు అన్ని రుణ సదుపాయాలు ఈ బ్యాంకు ద్వారానే అందించడం జరుగుతుంది. మా ప్రభుత్వం యెక్క ముఖ్య లక్ష్యం వ్యవసాయ అబివృద్ది .

మనకు మన దేశ ప్రజలకు ఆకలి తీర్చే రైతు ఎప్పుడు సంతోషంగా ప్రశాంతంగా తన జీవనాన్ని గడపాలనేదే మా పార్టీ ముఖ్య ఉధ్దేశం.