తెలుగు | English

స్త్రీలకు ఎన్ని తెలివితేటలు, విఙ్ణానం, శ్రమించి పనిచేసే ఆత్మవిశ్వాసం ఉన్న ఈ రోజుకు కూడా స్వేఛ్చగా జీవించలేకపోవడానికి రాజకీయ వ్యవస్థే ముఖ్య కారణం.

2016-11-25 5167


స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఒకటే మార్గం. రాజకీయలలోనికి 100% స్త్రీలు రావాలి. స్త్రీలకు ఎన్ని తెలివితేటలు, విఙ్ణానం, శ్రమించి పనిచేసే ఆత్మవిశ్వాసం ఉన్నా ఈ రోజుకు కూడా స్వేఛ్చగా జీవించడానికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొనవలసి వస్తుంది.ఎన్ని చట్టాలు తెచ్చినా ఎంత రక్షణ కల్పించిన మనం స్త్రీలకు తగిన న్యాయం చేయలేకపోతున్నాం. దీనివలన వారు సమాజంలో ఆర్దికంగా, మానసికంగా నిలబడటానికి ఎన్నో ఒడిదుడుకులను ఈరోజుకి ఎదుర్కొనవలసి వస్తుంది. వీరిలో ఆత్మస్దైర్యం పెరగాలంటే ఒకటే మార్గం. రాజకీయలలోనికి 100% స్త్రీలు రావాలి. మా ఆలోచనలు ఈ దిగువున మీకు తెలియపరుస్తున్నాము.

దేశంలోగానీ రాష్ట్రంలో గానీ ఇద్దరు ఉప ప్రదానులు ఇద్దరు ముఖ్యమంత్రలు ఉండాలి. వీరిలో స్త్రీలకు ఒకరు పురుషులకు ఒకరు తప్పక నియమించాలి.
మన ప్రపంచ జనాభాలో  స్త్రీ-పురుషులు సమానంగా ఉన్నారు.
స్త్రీలకు ఆత్మస్దైర్యం పెరగాలంటే .. గ్రామ స్దాయి సర్పంచ్ నుండి యం.పిల వరకు ఎన్నికలలో సమానమైన సీట్లు ఇచ్చేదానికన్నా స్త్రీలకు, పురుషులకు ఇద్దరికి వేరువేరుగా ఎన్నికల్లో నిలబెడితే అప్పుడు ప్రతీ స్త్రీకు స్వతంత్య్రంగా నిర్ణయాలు తీసుకొని జీవించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు తన సమస్యలను తనే నేరుగా ఎదుర్కొనడానికి ఆత్మస్దైర్యంగా నిలబడగలుగుతుంది.
ఉదా 1 :- ఒక గ్రామంలో ఒక సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు స్త్రీలకు ఒక సర్పంచ్, పురుషులకు ఒక సర్పంచ్ వేరువేరుగా నిలబడతారు. ఈ విదానం వలన స్త్రీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని ఎటువంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
ఉదా 2 :- ఒక రాష్ట్రంలో 30 ఎం.పి. స్థానాలు వుంటే.. స్త్రీలకు 15 ఎం.పి. స్థానాలు, పురుషులకు 15 ఎం.పి. స్థానాలు ఇవ్వడం కన్నా, ఆ 30 ఎం.పి. స్థానాలలో (30 ఎం.పి. స్థానాలు స్త్రీలకు + 30 ఎం.పి. స్థానాలు పురుషులకు=60) స్త్రీలకు ఒకరు, పురుషులకు ఒకరు వేరువేరుగా పోటి చేయడానికి వీలు కలిపిస్తే స్త్రీలకు మన దేశంలొ పూర్తిగా సమన్యాయం జరుగుతుంది.

ప్రస్దుత పరిపాలన వ్యవస్ద
1. రాష్ట్రపతి ఒకరు ఉన్నారు.
2. ఉప రాష్ట్రపతి ఒక్కరే ఉన్నారు
3. ఒక ప్రధాన మంత్రి ఒక్కరే ఉన్నారు.
4. ఉప ప్రదాని ఒక్కరే ఉన్నారు.
5. ప్రతి ఒక్క పార్లమెంట్ స్దానానికి కూడా ఒక్కరే ఉన్నారు.
6. ప్రతి ఒక్క అసెంబ్లీ స్దానానికి ఒక్కరే ఉన్నారు.
7. ప్రతి ఒక్క జెడ్.పి.టి.సి స్దానానికి ఒక్కరే ఉన్నారు.
8. ప్రతి ఒక్క ఎం.పి.పిల స్దానానికి ఒక్కరే ఉన్నారు.
9. ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ స్దానానికి ఒక్కరే ఉన్నారు.
10. ప్రతి ఒక్క ఎం.పి.టి.సి స్దానానికి ఒక్కరే ఉన్నారు.
11.ఒక వార్డు కి ఒక వార్డు మెంబరు ఒకరే వున్నారు

ఈ క్రింది విధంగా కొత్త పరిపాలన వస్తే స్త్రీలకు మంచి జరుగును
1. రాష్ట్రపతి ఒకరు ఉంటారు. వీరిలో స్త్రీ పురుషులు ఎవరైనా ఉండవచ్చు.
2. ఉప రాష్ట్రపతులు ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరిలో స్త్రీలకు ఒకరు మరియు పురుషులకు ఒకరు ఉంటారు.
3. ఒక ప్రధాన మంత్రి ఉంటారు. వీరిలో స్త్రీ పురుషులు ఎవరైనా ఉండవచ్చు.
4. ఇద్దరు ఉప ప్రదానులు ఉంటారు. ఈ ఇద్దరిలో స్త్రీలకు ఒకరు మరియు పురుషులకు ఒకరు ఉంటారు.
5. ప్రతి ఒక్క పార్లమెంట్ స్దానానికి ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరిలో స్త్రీలకు ఒకరు మరియు పురుషులకు ఒకరు ఉంటారు.
6. ప్రతి ఒక్క అసెంబ్లీ స్దానానికి ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరిలో స్త్రీలకు ఒకరు మరియు పురుషులకు ఒకరు ఉంటారు.
7. ప్రతి ఒక్క జెడ్.పి.టి.సి స్దానానికి ఒకరు ఉంటారు. వీరిలో స్త్రీ పురుషులు ఎవరైనా ఉండవచ్చు. మరియు ఉప జడ్.పి.టి.సిలు ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరిలో స్త్రీలకు ఒకరు మరియు పురుషులకు ఒకరు ఉంటారు.
8. ప్రతి ఒక్క ఎం.పి.పిల స్దానానికి ఒకరు ఉంటారు. వీరిలో స్త్రీ పురుషులు ఎవరైనా ఉండవచ్చు. మరియు ఉప ఎం.పి.పిలు ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరిలో స్త్రీలకు ఒకరు మరియు పురుషులకు ఒకరు ఉంటారు.
9. ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ స్దానానికి ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరిలో స్త్రీలకు ఒకరు మరియు పురుషులకు ఒకరు ఉంటారు.
10. ప్రతి ఒక్క ఎం.పి.టి.సి స్దానానికి ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరిలో స్త్రీలకు ఒకరు మరియు పురుషులకు ఒకరు ఉంటారు.
11.ఒక వార్డు కి  ఇద్దరు వార్డు మెంబర్లు ఉంటారు. ఈ ఇద్దరిలో స్త్రీలకు ఒకరు మరియు పురుషులకు ఒకరు ఉంటారు.

ఈ విదానం వలన ప్రపంచంలో స్త్రీలు ఆత్మస్తైర్యంగా జీవించటమే కాకుండా వారికి పూర్తిగా రక్షణ కలుగుతుంది. అంతే కాదు ప్రపంచ ఆర్ధిక వ్యవస్త అభివృద్ధి చెందుతుంది. స్త్రీలు గ్రామ స్దాయి నుండి కేంద్ర స్దాయి వరకు అన్ని స్దానాలకు పోటీ చేయడానికి వీలు అవుతుంది అని మా ఆలోచన.
ఏ దేశ ఆర్దిక వ్యవస్ద మీద ఒక్క రూపాయి కూడా బారం పడదు. ఎందుకంటే ఒక ఎంపీకానీ, ఒక ఎమ్మెల్యే కానీ వారి నియోజక వర్గంలో జనాభా లక్ష మంది ఉంటే 50వేల మంది పురుషలు 50వేల మంది స్త్రీలు ఉన్నారు. అయితే ఈ లక్ష మంది జనాభాకు ఒక ప్రజా ప్రతినిదికి ఒక నెలకు పారితోషకంగా కనీసం 50వేలు అయినా ఇవ్వడం జరుగుతుంది. మా నూతన విదానం వలన స్త్రీలకు ఒకరు పురుషులకు ఒకుర వేరుగా పోటీ చేయడం వలన వీరిద్దరికి ప్రస్ధుతం ఒక ప్రజా ప్రతినిదికి ఒక నెలకు ఇచ్చే పారితోషకాన్నే జనాభాను మరియు పారితోషకాన్ని సమానంగా పంచి ఆ నియోజక వర్గ ప్రజలకు తక్కువ సమయంలో సేవలందించడానికి ఉపయోగపడతారు. స్త్రీల విషయంలో పైన తెలపిన మా ఆలోచనలను ప్రపంచ ప్రజలందరు ఒక్క సారి ఆలోచిస్తారని ప్రార్దిస్తున్నాము.
ఒక్కసారి ప్రపంచ ప్రజలందరూ ఆలొచిస్తారు అని ప్రార్దిస్తున్నాం.