తెలుగు | English

ఉచిత విద్య అనేది ప్రతి పౌరుడి ప్రాదమిక హక్కు. ఈ హక్కు అందకపోవడానికి రాజకీయ వ్యవస్థే ముఖ్య కారణం

2016-11-25 8451


విద్య అనేది ప్రతి పౌరుడి ప్రాదమిక హక్కు. మన దేశంలో విద్యను అభ్యసించడానికి సామాన్యునికి అందుబాటులో లేకుండా ఉండటానికి గల కారణం మన దేశ విద్యావ్యవస్ధ పటిస్టంగా లేకపోవడమే దీనికి గల ముఖ్య కారణం. మనిషి మనుగడకు శారీరక శక్తి ఒక్కటే చాలదు తెలివితేటలు, విజ్నానము కూడా ఎంతో అవసరం. మన దేశంలో ప్రతి పౌరుడు శారీరకంగా ఎంత కష్టపడి పనిచేసిన ఆర్దికంగా ఎదగలేకపోవడానికి కారణం కావలసిన విద్యార్హత లేకపోవడమే ప్రదాన కారణం ఒకటైతే విద్యను అందించే విద్యాసంస్దలు సామాన్యునికి అందుబాటులో లేకపోవడం మరొకటి.
మన దేశంలో ప్రతి పౌరుడు విద్య కోసం ప్రతీ రోజు శారీరకంగా మానసికంగా నష్టపోవటమే కాకుండా ప్రమాణాలు లేని ట్రాన్స్ పోర్టులో ప్రయాణం చేయవలసిన పరిస్దితి ఏర్పడింది. ఈరోజుకి కూడా సరైన సౌకర్యాలు లేక పౌరులు విద్యకు దూరమ అవడానికి మరొక కారణం. ఏది ఏమైనా విద్య అనేది ప్రతి పౌరుడి ప్రాదమిక హక్కు. మన దేశంలో ప్రైవేటు విద్యా సంస్దలను పూర్తిగా రద్దు చేయాలి. ప్రభుత్వ ఆదీనంలోనే సమాన విద్యను ప్రతీ ఒక్క పౌరుడికి అందే విదంగా ఒక నిర్దిష్టమైన ప్రణాలికను తయారు చేయాలి.

విద్యావ్యవస్ద విషయంలో మా పార్టీ ఆలోచనలు : -

1. ఎల్.కేజీ నుండి పి.జి వరకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను ప్రతి ఒక పౌరునికి పూర్తిగా అందించడమే మాపార్టీ యెక్క ముఖ్య లక్ష్యం.

2. ఎల్.కేజీ నుండి పదవ తరగతి వరకు ప్రతీ గ్రామాలలో స్దానికంగా విద్యను అందిస్తాం.

3. పట్టణాలలో అయితే వార్డుల వారీగా లేదా 1000 నుండి 1500 ఓటర్లు ఉన్న ప్రాంతంలో ఎల్.కేజీ నుండి పదవ తరగతి వరకు అందిస్తాం.

4. పంచాయితీల వారీగా ఒక్కొక్కటి చొప్పున కాలేజీని ఏర్పాటు చేస్తాం.

5. జిల్లాల వారీగా యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తాం.

6. ప్రైవైటు విద్యాసంస్దలను మన దేశంలో పూర్తిగా రద్దు చేస్తాం.

7. ఉన్నత ప్రమాణలతో ఉన్నత విద్యను ప్రతి ఒక్క పౌరునికి అందించడానికి గల విద్యార్హత ఉన్న వారిని నియమిస్తాం.

8. ఒక నూతన టీచర్స్ ఎంప్లాయిమెంట్ వ్యవస్ద ఏర్పాటు చేస్తాం. ఈ ఎంప్లాయిమెంట్ వ్యవస్ద ద్వారానే ప్రైవేటు, ప్రభుత్వం అనే తేడా లేకుండా ఏ ఒక్కరినైనా టీచింగ్ కోసం నియమించుకోవాలి. లేనిచో ఆవిద్యా సంస్దల యెక్క అర్హతను రద్దు చేస్తాం.