తెలుగు | English

నల్ల ధనాన్ని పూర్తి స్తాయిలో అరికట్టడానికి 18 సూత్రాలు

2016-11-17 10499


నల్ల ధనాన్ని పూర్తి స్తాయిలో అరికట్టలేకపోతే నల్ల దానం పోయిన వాళ్ళు ఇప్పుడు నష్టపోయినదానికన్నా 10 రెట్లు సంపాదించుకునే మార్గాలు మన దేశంలో వున్నాయి. అందుకే ఇదే సమయంలో నల్ల ధనాన్ని అరికట్టడానికి మన దేశంలో కొత్త చట్టాలను తీసుకురావలసిన అవసరం ఎంతయినా వుంది.

మా నూతన జాతీయ పార్టి నల్ల ధనాన్ని పూర్తి స్తాయిలో అరికట్టడానికి 18 సూత్రాలను మన  దేశ ప్రజలకు తెలియపరుస్తుంది. ఈ 18 సూత్రాలను మన ప్రభుత్వాలు అమలు చేస్తే 100% నల్ల ధనాన్ని అరికట్టవచ్చు.

ఈ దిగువున 18 సూత్రాలను వ్రాస్తున్నాము అని తెలియపరుస్తున్నాం

1. ప్రతి పల్లెను జనాభాతో సంబంధం లేకుండా ఒక ప్రజా రక్షణ కమిటిని ఏర్పాటు చెయ్యాలి. ఈ ప్రజా రక్షణ కమిటి పరిదిలో మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్ధిక లావాదేవీలు జరగాలి. అంతే కాదు ఈ గ్రామంలో వున్న స్థిరచరాస్తుల యొక్క సర్వాధికారాలు ఈ ప్రజా రక్షణ కంమిటీలకే ఇవ్వాలి. (example: భూములు, ఘనులు, బ్యాంకులు, కంపెనీలు, షాపులు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, income tax, sales tax, GST, insurence, share market,proffesional tax, etc...)

2. పట్టణాలలో 2000 జనాభాకు ఒక ప్రజా రక్షణ కమిటిని ఏర్పాటు చెయ్యాలి. ఈ ప్రజా రక్షణ కమిటి పరిదిలో మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్ధిక లావాదేవీలు జరగాలి. అంతే కాదు ఈ గ్రామంలో వున్న స్థిరచరాస్తుల యొక్క సర్వాధికారాలు ఈ ప్రజా రక్షణ కంమిటీలకే ఇవ్వాలి. (example: భూములు, ఘనులు, బ్యాంకులు, కంపెనీలు, షాపులు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, income tax, sales tax, GST, insurence, share market,proffesional tax, etc...)

3. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కాంట్రాక్టులు ఏవయినా కావచ్చు ఈ ప్రజా రక్షణ కంమిటీలకు మాత్రమే మొదటి కాంట్రాక్టు హక్కులను ఇవ్వాలి. (example: రోడ్లు, కాలువలు, బ్రిడ్జులు, రైల్వే లైనులు, మెట్రో లైనులు, బిల్డింగులు, etc...)

4. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లీజులు ఏవయినా కావచ్చు ఈ ప్రజా రక్షణ కంమిటీలకు మాత్రమే మొదటి లీజు హక్కులను ఇవ్వాలి. (example: ఘనులు, వాయువులు, భూములు, బిల్డింగులు, etc...)

5. ఒక పౌరునికి ఒక్క బ్యాంకు ఎకౌంటు మాత్రమే ఇవ్వాలి. దేశంలో మరెక్కడా రెండవ బ్యాంకు ఎకౌంటు వుండకూడదు.

6. ఓటు హక్కు వున్న ప్రాంతంలోనే పౌరునికి ఒక బ్యాంకు ఎకౌంటు మాత్రమే ఇవ్వాలి.

7. ఒక పౌరునికి ఎన్ని కంపెనీలు వున్న ఒక బ్యాంకు ఎకౌంటు మాత్రమే వుండాలి. ఈ ఎకౌంటు ద్వారానే ఆర్ధిక లావాదేవీలు(సొమ్ము జమ చేసుకోవటం) జరగాలి.

8. ప్రతి పల్లెలో జనాభాతో సంబంధం లేకుండా ఒక స్మార్ట్ బ్యాంకు ఏర్పాటు చెయ్యాలి. ఈ బ్యాంకు నిర్వాహణ భాధ్యత ప్రభుత్వాలు మరియు నిరుద్యోగులు మాత్రమే నడిపించాలి. ఎట్టి పరిస్థితులలో మూడవ వ్యక్తి చేతికి అప్పజెప్పకూడదు.

9. పట్టణాలలో 2000 జనాభాకు ఒక స్మార్ట్ బ్యాంకు ఏర్పాటు చెయ్యాలి. ఈ బ్యాంకు నిర్వాహణ భాధ్యత ప్రభుత్వాలు మరియు నిరుద్యోగులు మాత్రమే నడిపించాలి. ఎట్టి పరిస్థితులలో మూడవ వ్యక్తి చేతికి అప్పజెప్పకూడదు.

10. 2000 నోట్లను ఎక్కువగా ముద్రించకూడదు.

11. ముద్రణ ఖర్చు ఎక్కువ అయినా 100, 50, 20, 10, 5, 2, 1 రూపాయలను ముద్రించాలి.

12. వీలయినంత తక్కువ సమయంలో ప్రతి ఒక్కరికి ఒక స్మార్ట్ స్వైపింగ్ మెషిన్ ఇవ్వాలి.

13. మన దేశంలో వున్న అన్ని వ్యాపార సంస్థలకు స్వైపింగ్ మెషిన్ల వాడకం తప్పనిసరిగా చట్టం తీసుకురావాలి.

14. చార్టెడ్ అకౌంట్స్ మన దేశానికి చాలా అవసరం. ప్రతి పల్లెలో ఒక చార్టెడ్ అకౌంటెంట్ ను నియమించాలి. వీరి ఆధీనంలోనే పల్లెలో వున్న ప్రభుత్వ మరియు ప్రజల స్థిరాస్తులు మరియు చరాస్తులు యొక్క ఆర్ధిక లావాదేవీలు ఎవయినా కావచ్చు వీరి ద్వారా మాత్రమే జరగాలి. (example: భూములు, ఘనులు, బ్యాంకులు, కంపెనీలు, షాపులు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, income tax, sales tax, GST, insurence, share market,proffesional tax, etc...)

15. చార్టెడ్ అకౌంట్స్ మన దేశానికి చాలా అవసరం. పట్టణాలలో 2000 జనాభాకు  ఒక చార్టెడ్ అకౌంటెంట్ ను నియమించాలి. వీరి ఆధీనంలోనే ప్రభుత్వ మరియు ప్రజల స్థిరాస్తులు మరియు చరాస్తులు యొక్క ఆర్ధిక లావాదేవీలు ఎవయినా కావచ్చు వీరి ద్వారా మాత్రమే జరగాలి. (example: భూములు, ఘనులు, బ్యాంకులు, కంపెనీలు, షాపులు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, income tax, sales tax, GST, insurence, share market,proffesional tax, etc...)

16. ప్రతి సంవత్సరం ప్రతి పౌరుడి ఆదాయ వివరాలు తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా నూతన చట్టాలను తీసుకురావాలి.

17. ప్రతి పల్లెను జనాభాతో నిమిత్తం లేకుండా ఒక ఆర్ధిక సంస్థగా ఏర్పాటు చెయ్యాలి. ఈ ఆర్ధిక సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆధీనంలో వుంటాయి.

18. ప్రతి పట్టణంలో 2000 జనాభాకు ఒక ఆర్ధిక సంస్థను ఏర్పాటు చెయ్యాలి. ఈ ఆర్ధిక సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆధీనంలో వుంటాయి.

పైన తెలిపిన 18 సూత్రాలను మన దేశంలో అమలుపరిస్తే నల్ల ధనం, అవినీతి సొమ్ము, దొంగ నోట్లు ఉండవు. మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశం. మన దేశ ప్రజలు మంచి మార్గంలో నడిచే నాయకుని బట్టి నడుస్తారని మన దేశ చరిత్ర చెప్తుంది. నల్ల ధనం నిర్మూలనలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని మన దేశ ప్రజలందరూ నడుస్తున్నారు. పైన తెలిపిన మా పార్టి ఆలోచనలు మన దేశానికి మంచిని చేసే విధంగా ఉంటే మన దేశ ప్రజలందరికి తెలియపరుస్తారని కోరుకుంటున్నాం. జైహింద్...