తెలుగు | English

మా నూతన జాతీయ పార్టి తరపున బాలల దినోత్సవ శుభాకాంక్షలు

2016-11-14 5195


బాలల దినోత్సవం సందర్భంగా బాలలందరికీ మా నూతన జాతీయ పార్టి తరపున శుభాకాంక్షలు.
బాలల దినోత్సవం సందర్భంగా మన పెద్దలందరికీ మా నూతన జాతీయ పార్టి తరపున ఒక విన్నపాన్ని చేసుకుంటున్నాం. మనం బాలల దినోత్సవం ఒక్కరోజే కాదు, ప్రతి రోజు బాలల దినోత్సవం జరగాలి. 
బాలల దినోత్సవం నాడు బాలల గురించి ఆలోచిస్తున్నాం, మిగిలిన రోజులన్నీ మర్చిపోతున్నాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటినుండి ఈరోజు వరకు కూడా బాలల సంరక్షణ మనదేశంలో 40% కూడా లేదు. బాలల సంరక్షణ బాద్యత తల్లి తండ్రులే కాదు, ప్రతి పౌరుని పాత్ర ఉంటేనే మన దేశంలో 100% బాలలను సంరక్షించుకోగలుగుతాం. 
1. మన దేశంలో బాల కార్మికులు ఒక్కరు కూడా వుండకూడదు.
2. బాలల కోసం బాలలు నివసిస్తున్న ప్రాంతంలోనే విద్యని అందించాలి. ( ఒకటవ తరగతి నుండి పదోవ తరగతి వరకు ఉచిత విద్యను వున్నత ప్రమాణాలతో అందించాలి. )
3. బాలల కోసం బాలలు నివసిస్తున్న ప్రాంతంలోనే వున్నత ప్రమాణాలతో వైద్యం అందించాలి.
4. బాలలలో పౌష్టికాహార లోపం లేకుండా పౌష్టికాహారాన్ని ప్రతిరోజూ అందించాలి.
బాలల కోసం మన దేశంలో నూతన చట్టాలను  తీస్కురావటం ప్రతి పౌరుని భాధ్యత. మనందరి లక్ష్యం ఒక్కటిగా వుండాలి. అప్పుడే మనందరం ప్రతిరోజూ బాలల దినోత్సవంగా ప్రకటించవచ్చు. 
జైహింద్...