తెలుగు | English

భారతదేశ ఎన్నికలలో పౌరుని పాత్ర 100% వుండాలి

2016-11-25 4514


భారతదేశంలో ప్రతి పౌరుడికి ఎన్నికల మీద పూర్తి అవగాహన ఉండాలి. ఎన్నికలు ఎప్పుడు జరిగిన ప్రతి పౌరుడియొక్క బాద్యత 100శాతం ఉండాలి.

భారతదేశంలో ఎన్నికలు అంటే ఓటు హక్కు ఉన్న ప్రతీ పౌరుడి నిరంతర పర్యవేక్షణలో మన దేశ ప్రజా స్వామ్య హక్కులను ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలందరికీ అందించడానికి నడిపించే విదానమే భారతదేశ ఎన్నికల ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాని ఎన్నికలు అంటే ఒక వ్యక్తికి సంబందించినవి కాదు అలాగే ఒక పార్టీ మనుగడకు సిద్దాంతాలకు సంబందించినవి కావు.

పార్టీలు కేవలం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ది యెక్క వ్యక్తిత్వం, అర్హతకు సంబందించిన విషయాలు తెలుసుకొని దేశానికి మేలు చేసే వ్యక్తులుగా గుర్తించి ఎన్నికలలో నిలబెట్టడానికి అర్హతకు సంబందించినవి. అందుకే ఈ పార్టీలన్నీ స్దాపించబడినవి.

పార్టీలకు భారతదేశ ఎన్నికలకు ఎటువంటి సంబందం లేదని భారతదేశ పౌరులందరు ఒక్కసారి ఆలోచించాలని నేను ఆశిస్తున్నాను. మన భారతదేశ భవిష్యత్ మన దేశ ఎన్నికల మీద ఆదారపడి ఉన్నది. దేశంలో ఎన్నికలు ఎప్పుడు జరిగిన పార్టీలతో సంబందం లేకుండా బారతదేశంలో ఉండే ప్రతీ పౌరుడు పోటీ చేయడానికి ముందుకు రావాలి.అంతే కాదు ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ప్రతి పౌరుడు 100శాతం బాద్యతతో వ్యవహరించాలి ఇదే మనం మన దేశానికి ఇచ్చే గొప్ప కానుక.

ప్రతి పౌరుడు భారతదేశ ఎన్నికల సమయంలో గర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంది. అది ఏమిటంటే ఎన్నికలు పూర్తి అయ్యేవరకు భారతదేశ జెండా తప్ప ఏపార్టీకు సంబందించిన జెండాలు పట్టుకోకూడదు. కేవలం పోటీల నిలబడే అభ్యర్ది మాత్రమే వారి పార్టీ జెండాను పట్టుకోవాలి. మీరు అబిమానించే అభ్యర్ది ఎన్నికలలో గెలిచిన తర్వాత ఆ వ్యక్తి పార్టీ యెక్క జెండాను అందరు ఒక్కసారి పట్టుకుని గౌరవించాలి.