తెలుగు | English

భారత దేశం ఆర్దికంగా అభివృద్ధి చెందటానికి మా న్యూ నేషనల్ పార్టీ పార్టీ ఆలోచనలు

2017-01-12 7178


                                                                              
భారత దేశం ఆర్దికంగా అభివృద్ధి చెందటానికి మా న్యూ నేషనల్ పార్టీ పార్టీ ఆలోచనలలో ఒకటి  ఒక పౌరుని దగ్గర ఎన్నివేల కోట్లు వుంటే అన్ని వేల కోట్లకు ఒక్క నోటును మాత్రమే ముద్రించి ఇస్తాము.
 
ప్రభుత్వ బ్యాంకులు :-మా నూతన జాతీయ పార్టీ వచ్చే ఎన్నికలలో గెలిస్తే అర్.బి.ఐ విధానాలలో కొత్త మార్పులు చేస్తాము.అవి ఏమిటి అంటే ఒక్క రూపాయ         కూడా ప్రవేటుకంపెనీలకు డైరెక్ట్ గా అప్పు ఇవ్వము. బ్యాంకులలో నిలువ వున్న ప్రతి రూపాయ మొదట రైతులకు, ఉపాదిపనివారికి, నిరుద్యోగలకు                         మాత్రమే అప్పుఇస్తాము.మా ప్రభుత్వమే బ్యాంకులకు, నిరుద్యోగుల తరపున సెక్యూరిటీ ఇస్తుంది. నిరుద్యోగులతో అనుసంధానంగా వున్న కంపెనీలకు                   మాత్రమే అప్పు ఇస్తాము. ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆర్దిక లెక్కలు పూర్తి అవగానే  ఒక పౌరుని దగ్గర ఎన్నికోట్లువున్నా, స్థిరచరాస్తులు కలిపి  ఒక్క నోటులోనే ఆ పౌరుని ఆస్థిని  ముద్రించి ఇస్తాము. అర్.బి.ఐ ఇచ్చే ఈ నోట్లో వున్న కోడ్ ఆధారంతో ప్రతిపౌరుడు తనకు కావలసి అవసరాలను తనే స్వయంగా నోట్ల ముద్రణ కూడా  ముద్రించుకోవచ్చు . ప్రతి పౌరుడు తనకు కావలసినవి ఏవైనా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, ఈ విధానంవలన నోట్ల ముద్రణ ఖర్చు మనదేశంలో తగ్గుతుంది. అంతేకాదు నల్లధనం ,అవినీతి సొమ్ము , దొంగసొమ్ము , ఈ మూడింటిని మనదేశంలో లేకుండా చేయవచు.మరియు ప్రతి పౌరునినోటు ఎక్కడకివేల్లిందో తెలిసికోవటం చాలాసులభం.
 
  ప్రభుత్వ కాంట్రాక్టులు :-మనదేశంలో ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగులకు మరియు ఉపాది కార్మికులకుమాత్రమే ఇస్తాము.కేంద్ర మరియు రాష్ట్ర  ప్రభుత్వ                కాంట్రాక్టులు మా ప్రభుత్వము ప్రవేటు సంస్థలకు ఇవ్వదు. 1000 జనాభాకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. ఈ కమిటిపరిధిలో నిరుద్యోగ ఉపాది కార్యాలయాలు ఉంటాయి. ఈ కాయలయలద్వారానే మన దేశంలో  ఏ కాంట్రాక్టు పనులు అయినా జరుగుతాయి. భుఘర్బ వాయువులు ,ఘనులు లీజు :-మన దేశంలో ఘనుల లీజులు ఇక ప్రవేటు సంస్థలకు ఇవ్వము. 1000 జనాభాకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము.ఈ కమిటీ ద్వారామాత్రమే  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పరిదిలో గల ఏ ఘనులు  అయినా లీజులకు ఇవ్వాలి. ఏ కమిటి పరిదిలోగల ఘనుల లీజులు ఆ పరిదిలోగల నిరుద్యోగ ఉపాది కార్యాలయాలకే చెందేవిధంగా చట్టాలను తీసుకువస్తాము. 

మాపార్టీ ఆలోచనలు నచ్చితే  ఏ పార్టీలతో సంబంధం లేకుండా మనభారతదేశంలో  ఎన్ని కోట్లమంది  విద్యావంతులుంటే అంతమంది  రాబోయే ఎన్నికలలో  మీరే  డైరెక్ట్ గా పోటిచేయండి.మీకు మనదేశానికి కూడా చాలా లాభం.1 మనదేశం ఆర్ధికముగా అభివృద్ధి చెందుతుంది 2 నిరుద్యోగం కొంతవరకు మనదేశంలో తీరుతుంది. 

భారతదేశ పౌరులందరికీ  ఒక అభ్యర్ధన :-భారతదేశ ఎన్నికలలో పోటిచేసేహక్కు ప్రతిపౌరునికి వుంది . మేధావులందరూ రాబోయే ఎన్నికలలో                                     పోటిచేయండి.పార్టీలు కేవలం మంచివారిని మనదేశ ప్రజలకు తెలియపరచటానికిమాత్రమే అని మనమందరం గుర్తుంచుకోవాలి.  ఒక్కసారి ప్రతిపౌరుడు                    రాజ్యాంగం లో వ్రాసిన ప్రతి అక్షరం చదవాలి ఇంకా దీనిగురించి పూర్తిగా తెలిసిన  మేధావుల దగ్గర మనందరం  తెలుసుకోవాలి.  మన  రాజ్యాంగం  గురించి                 మనదేశ పౌరులందరికి  తెలియపరచాలి.ఆనాడు  అంబేద్కర్ గారు ధర్మమార్గంలో నడిచిన మనదేశ ప్రతిపౌరులయొక్క మార్గాన్నే మన భారతదేశ  రాజ్యాంగంగా వ్రాసినారు మన డాక్టార్ బి .అర్ అంబేద్కర్ గారు, అందుకే  అయన  ప్రతిక్షణం మనలో ఒకరిగా ఈ రోజుకీ జీవించి వున్నారు.  జైహింద్ .