తెలుగు | English

మా నూతన పార్టీ లక్ష్యము భారతదేశంలొ నిరుద్యొగం అనే మాట వినపడకూడదు

2016-11-25 4176


మా నూతన పార్టీ లక్ష్యము భారతదేశంలొ నిరుద్యొగం అనే మాట వినపడకూడదు

1. ప్రతి గ్రామంలో ఒక నిరుద్యొగ కార్యాలయం ఏర్పాటు చేస్తాం. అలాగే పెద్ద గ్రామాలు, పట్టణాలు అయితే ప్రతీ 2000 జనాబాకు ఒక నిరుద్యొగ ఉపాది కార్యాలయం ఏర్పాటు చేస్తాం.

2. భారతదేశంలో కేంద్ర రాస్ట్రాల యొక్క ఆర్ధికపరమైన ఏ లావాదేవీలైనా మా నూతన పార్టీ ఏర్పాటు చేయబోయే ఈ నిరుద్యొగ ఉపాది కార్యాలయం నుండే ఏ లావాదేవీలైనా అమలుచేసే చట్టాలను తీసుకు వస్తాం

3. విద్యా అర్హతను బట్టి లేదా ప్రతిభకు తగిన విధంగా కెటగిరి వారీగా విభజించి నూతన కాంట్రాక్టు వ్యవస్తలను ఏర్పాటు చేసి వీటిని నిరుద్యొగ ఉపాది కార్యాలయాలు ద్వారా ప్రతీ ఒక్క పౌరునుకి ఉపాది అవకాసాలు కలిపిస్తాం

మన భారతదేశంలో రోజు రోజుకి నిరుద్యోగ సమస్య పెరుగుతూనే వస్తుంది. మన దేశంలో అర్హతకు తగిన ఉద్యోగ ఉపాది అవకాశాలు దొరకడం చాలా కష్టంగా ఉన్నాయి. రోజు రోజుకి నిరుద్యోగులలో నిరుత్సాహమే తప్ప మానసిక శాంతి, మనోధైర్యం కలగడం లేదు. ఎందుకంటే మన దేశ రాజకీయ పరిపాలన వ్యవస్దలో కొన్ని లోపాలు ఉన్నాయి.

మన దేశంలో నిరుద్యోగుల కోసం ప్రస్దుత ప్రభుత్వాలు అమలు చేస్తున్న విదానాల వలన నిరుద్యోగులకు ఎప్పటికీ మేలు చేయలేవు. నిరుద్యోగుల కోసం నూతన విదానాలను తీసుకువస్తే కానీ నిరుద్యోగ సమస్య మన దేశంలో తీరదు.

మా నూతన ప్రభుత్వం వస్తే గ్రామాల వారీగా వార్డుల వారీగా నిరుద్యోగ ఉపాది కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం.

ఈ ఉపాది కార్యాలయాల ద్యారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రైవేటు కంపెనీలు కానీ, వ్యాపార సంస్దలు కానీ, డైలీ వర్కర్లను కానీ, ఇంటి పనివారిని కానీ ఇలా ఏ సంస్దలు అయినా కావచ్చు ఈ నిరుద్యోగ ఉపాది కార్యాలయాల ద్వారా మాత్రమే విదులలోనికి తీసుకునే విదంగా నూతనా విదానాలను తీసుకువస్తాం. ఈ విదానం వలన నిరుద్యోగులందరికి రక్షణతో కూడిన ఉపాది అవకాశాలను కల్పించవచ్చు.

ఈ నిరుద్యోగ ఉపాది కార్యాలయం నుండి ఉపాది కల్పించిన ప్రతి ఒక్కరికి ఒక సర్వీసు రిజిస్టర్ ఏర్పాటు చేసి వారు సర్వీసులో ఉన్నంత కాలం సర్వీసు రిజిస్టర్లో వారికి సంస్దల నుండి రావలసిన ఆర్దిక లావాదేవీలు అన్నియు ఈ నిరుద్యోగ ఉపాది కార్యాలయంలో భద్రపరచడం జరుగుతుంది. ఈ ఉపాది కార్యాలయంలో నమోదు అయిన ప్రతీ ఒక్కరు ఉపాది కోసం దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ పనిచేసిన వారియెక్క పూర్తి వివరాలు మరియు ఆర్దిక లావాదేవీలు ఈ ఉపాది కార్యాలయం నుండే జరుగును.

దేశంలో కాని విదేశాలలో కాని ఉపాది అవకాసాలు ఎక్కడ వచ్చినా ఈ నిరుద్యోగ ఉపాది కార్యాలయాల ద్వారానే ప్రతి ఒక్కరిని విదులలోనికి తీసుకొనబడును.