తెలుగు | English

సెయింట్ మదర్ తెరెసా పుట్టినరోజు ఆగస్టు 26 న ప్రపంచ వ్యాప్తంగా ఉచిత సేవా హాస్పటల్స్ నిర్మానానికి ప్రపంచ పౌరులారా ముందుకురండి రండి.

2017-06-06 6776


 సెయింట్ మదర్ తెరెసా పుట్టినరోజు  ఆగస్టు 26 న  ప్రపంచ వ్యాప్తంగా  ఉచిత సేవా హాస్పటల్స్ నిర్మానానికి  ప్రపంచ పౌరులారా ముందుకురండి  రండి. 
   
 మదర్ తెరెసా పుట్టినరోజు  ఆగస్టు 26 న ఉచిత సేవా హాస్పటల్స్  ప్రపంచ వ్యాప్తంగా ప్రతిగ్రామంలో,పట్టణంలో, వార్డులలో నిర్మిద్దాము.మదర్ తెరెసా ఉచిత సేవా హాస్పటల్స్ నిర్మానానికి మన  ప్రపంచ ప్రజలందరం ఒకే మాటమీద నిలబడి ఒక పెద్దకుటుంబంగా  జీవిద్దాము రండి.
ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కరికి పూర్తిగా ఉన్నత ప్రమాణాలతోమాతా శిశు సంరక్షణ ఉచిత వైద్యం  ప్రతీ గ్రామంలో ,వార్డులలో,పట్టణంలో ప్రపంచ ఆరోగ్య స౦స్థ (WHO)వారి సహకారంతో మనమందరము 
 ఆరోగ్యంగా ,సుఖముగా జీవించుతున్నాము.
 ప్రస్తుతము  ప్రపంచ వ్యాప్తంగా ప్రతిగ్రామంలో,పట్టణంలో, వార్డులలో ప్రపంచ జనాభాకు కావలసినవన్ని హాస్పటల్స్ లేకపోవుట వలన, మన జన్మకు మూలం అయిన ఎందరో తల్లులను మనం పూర్తిగా రక్షించుకోలేకపోవుచున్నాము.
 అంతేకాదు మనకు తెలిసో తెలియకో మనందరం ఇప్పటివరకు ఎందరో మేధావులను కోల్పోయాము .
 మేధావుల జన్మకు మూలం అయిన ఎందరో తల్లులను మనం పూర్తిగా రక్షించవలసిన భాద్యత ప్రతిపౌరునియొక్క భాద్యత. అసలు దీని మూలాన్ని మనం ఎందుకు కట్టడి చేయలేము. దీని మూలం రాజకీయ పరిపాలన వ్యవస్ద,
 మరియు మనం మన జీవన పరిస్దితులను బట్టి తయారు చేసుకున్న రూపాయి మానవ మనుగడనే శాసిస్తుంది.ఈరెండు మానవ మనుగడకే ముప్పు . అందుకే మన ప్రపంచ ప్రజలందరం  ఒకే మాటమీద ఉంటే మార్చగలం అనే నమ్మకం నాకు ఉన్నది.
 మన జన్మకు మూలం అయిన మన తల్లులను ,మేధావులను మన ప్రపంచ ప్రజలందరం ఒకే మాటమీద వుండి రక్షించుకుందాము,  అలాగే  ఒకే మాటమీద నిలబడి ఒక పెద్దకుటుంబంగా  జీవిద్దాము ప్రపంచ పౌరులారా రండి. 
1 మన ప్రపంచములో  పేద గొప్ప తేడా లేకుండా1000 జనాభా లేదా  ప్రతీ గ్రామంలో ,వార్డులలో,పట్టణంలో మదర్ తెరెసా ఉచిత సేవా హాస్పటల్స్  ప్రపంచ వ్యాప్తంగా నిర్మిద్దాము, 
2 ఉన్నత ప్రమాణాలతో అత్యాదునిక వసతులతో వైద్యాన్నిఉచితముగా ప్రపంచ  ప్రజలందరికి అందించినప్పుడే మనం మన బావీతరాలు, ఆరోగ్యంగా సుఖంగా జీవించుతాము.
3 ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కరికి పూర్తిగా ఉన్నత ప్రమాణాలతో ఉచిత వైద్యం అందించుదాము  ప్రతీ గ్రామంలో ,వార్డులలో,పట్టణంలో ఒకడాక్టర్, ఒక ఎ.ఎన్.ఎమ్.( స్త్రీలు )మరియు ఒక హెల్త్ అసిస్టెంట్ (పురుషులు)
4 ఒక లాబ్ టెక్నీషియన్, ఒక ల్యాబ్, ఆక్సిజన్ సిలిండర్, ఒక ఆంబులెన్స్, ఒక ఫార్మ్సిస్ట్, అత్యవసరానికి కావలసిన మందులు, 24గంటలు అందుబాటులో ఉంచుదాము. 
ప్రపంచ వ్యాప్తంగా మదర్ తెరెసా ఉచిత సేవా హాస్పటల్స్ అవగాహన కల్పించుదాము  ఒకే మాటమీద నిలబడి ఒక పెద్దకుటుంబంగా  జీవిద్దాము ప్రపంచ పౌరులారా రండి. నమస్కారములు.
 
విన్నపము ..  ప్రవేటు వైద్యం, ప్రభుత్వ వైద్యం అని తేడాలేకుండా భవిష్యత్తులో అందరం మదర్ తెరెసా ఉచిత సేవా హాస్పటల్స్  ప్రపంచ వ్యాప్తంగా ప్రతిగ్రామంలో,పట్టణంలో, వార్డులలో నిర్మిద్దాము ఒకే మాటమీద జీవిద్దాము రండి.నమస్కారములు