తెలుగు | English

ఉద్యమాల్లో పౌరుని పాత్ర ఎలా ఉండాలంటే ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కునే ఉద్యమం లాగ వుండాలి లేదా దేశం, దేశ ప్రజలు, కుటుంభం అభివృద్ది కోసం మాత్రమే వుద్యమాలు చేయాలి

2016-11-25 6147


మానవ మనుగడే ఒక ఉద్యమం. "మానవుడే లేకపోతే ఉద్యమాలు ఎవరిని రక్షించడానికి ఉపయోగపడతాయి." 

ఉద్యమంలో పాల్గొనే పౌరులందరికి నూతనపార్టీ యెక్క అభ్యర్దన..

1. ప్రజలకోసమే ఉద్యమాలు చేస్తున్నాము అని చెబుతున్నారు ఉద్యమ నాయకులు. మీరు ఉద్యమ నాయకులు పిలుపు విని ఉద్యమాలు చేస్తున్నారు. మీరు చేస్తున్న ఉద్యమం ఎంతవరకు దేశ ప్రజలకు ఉపయోగపడుతుంది. ఉద్యమ నాయకులు జీవితాలకు గానీ కుటుంబాలకు కానీ ఎప్పుడైనా హాని కల్గిందేమో ఒక్కసారి ఆలోచించండి.

2. మిమ్మల్ని నడిపించే ఉద్యమ నాయకులు మన దేశానికి, మన ప్రజలకు ఎంతవరకు హాని లేకుండా ఉద్యమాలు చేస్తున్నారు.

3. ప్రమాణాలే లేని ఉద్యమాలకు మీరెందుకు తోడుండాలి.

4. ఉద్యమ నాయకులు కుటుంబంకోసం ఆలోచించిన శ్రద్ద దేశ ప్రజల మీద లేదు. ఉండుంటే ఎందుకు వారు ఉద్యమాలలో పాల్గొని త్యాగాలకు సిద్దపడటంలేదు. ఇందులోనే తెలుస్తుంది వారి ఉద్యమంలో ఎంతవరకు నిజాయితీ ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి.

5. ఉద్యమ నాయకులు ఉద్యమాలకు మూలం అయితే ఉద్యమంలో పాల్గొన్నవారికి రక్షణగా ఉండి వారి జీవితాన్ని వారి కుటుంబాన్ని ఎందుకు త్యాగం చేయలేకపోతున్నారు.

6. నాయకుడు లేకున్నా లక్ష్యం మంచిదే అయితే మరో నాయకుడు వస్తాడు దయచేసి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. పౌరులందరికి మా నూతన పార్టీ తరుపున ప్రార్దిస్తున్నాను.

ఉద్యమంలో పాల్గొనే పౌరులందరికి నూతనపార్టీ యెక్క అభ్యర్దన..

దయచేసి ఉద్యమాల పేరుతో మీకుటుంబాలకు మన దేశానికి దూరం కాకండి. ఎవరైన ఉద్యమంలో పాల్గొనమంటే ఆ ఉద్యమకారుని యెక్క త్యాగం ఏమిటి వారి కుటంబంలో వారిలో ఎవరైనా త్యాగం చేసారా వారి కుటంబం ఆర్దికంగా బలంగా ఉందా లేదా ఆర్దంకగా బలంగా ఉంటే అంత ఆర్దిక బలం ఎక్కడిది అని తెలుసుకొని వారిని ప్రశ్నించడి. నిజమైన ఉద్యమకారులు ప్రస్దుతం లేరు. ఒక వేళ ఉన్న వారు ప్రజల ప్రాణాలతో ప్రజలకు ఇబ్బందలు కలిగే విదంగా ఉద్యమాలు నడిపించరు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వారే ముందుండి నడిపిస్తారు. అంతే కానీ పిరికితనం భయంతో జీవించరు ప్రస్దుతం ఉద్యమాల పేరుతో చాలామంది దేశ పౌరులను తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి పౌరులెవ్వరు ఉద్యమాలలో పాల్గొనే ముందు నాయకుని యెక్క త్యాగాలు కుటుంబం యెక్క త్యాగాలు తెలుసుకొని వారు చేసే ఉద్యమల వలన దేశప్రజలకు హాని లేకుండా ఉన్నప్పడు మీరు ఉద్యమంలో పాల్గొంటే తప్పులేదు.

ఉద్యమంలో పాల్గొనే పౌరులందరికి నూతనపార్టీ యెక్క అభ్యర్దన..

దయచేసి పౌరులెవ్వరు ఉద్యమాలలో పాల్గొనకండి ఉద్యమంలో పాల్గొనమని ఎవరైనా పిలుపునిస్తే ఆ ఉద్యమంలో ఉద్యమ నాయకుని యొక్క జీవిత చరిత్ర తెలుసుకుని ముందుకు వెళ్ళండి.

ప్రమాణాలు లేని ఉద్యమాలు ఎందుకు చేయాలి. కుటుంబాలను జీవితాలను ఎందుకు త్యాగం చేయాలి.

ఒక్క సారి ఉద్యమంలో పాల్గొనే ముందు ప్రతీ ఒక్క పౌరుడు ఆలోచించండి.

ఉద్యమంలో పాల్గొనే పౌరులందరికి నూతనపార్టీ యెక్క అభ్యర్దన..

ఒక దేశంలో ఒక రాష్ట్రాన్ని విడగొట్టడానికి చాలా మంది ఉద్యమాలు చేసారు. ఈ ఉద్యమంలో ఎందరో ప్రాణ త్యాగం చేసారు. కొందరు ఆర్దికంగా మానసికంగా నష్టపోయారు. వారి త్యాగల వలన ఒక రాష్ట్రం 2రాష్ట్రాలుగా విడిపోయింది. కానీ ఉద్యమం చేసిన వారు వారి కుటుంబం బోగబాగ్యాలతో చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. 2రాష్ట్రాలుగా విడిపోవడం వలన ఉద్యమం నడిపించిన వారికి మాత్రమే లాబం కల్గింది. ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలకు గానీ 2రాష్ట్రాల ప్రజలకు లాబాలు లేకపోగ ఆర్దికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొవలసి వస్తుంది. ఈరోజకు భవిష్యత్తులో కూడా మళ్లి ఈ 2రాష్ట్రాలు, ప్రాణత్యాగం చేసిన కుటుంబాలు మానసికంగా ఆర్దికంగా నిలబడటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. దయచేసి ఉద్యమానికి వెళ్లేముందు దేశ క్షేమం గురించి మానవ మనుగడకు బంగం లేని విదంగా ఉంటేనే ఉద్యమాలలో పాల్గొనాలి. దయచేసి పౌరులందరు ఉద్యమంలో పాల్గొనే ముందు ఒక్కసారి ఆలోచించండి.

ఉద్యమంలో పాల్గొనే పౌరులందరికి నూతనపార్టీ యెక్క అభ్యర్దన..

మానవ మనుగడే ఒక ఉద్యమం. "మానవుడే లేకపోతే ఉద్యమాలు ఎవరిని రక్షించడానికి ఉపయోగపడతాయి."

ప్రతీ ఒక్కపౌరుడు యెక్క ఉద్యమం ఎలా ఉండాలంటే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే ఉద్యమాలకే ఎక్కువ అవకాశం ఇవ్వాలి మీ తెలివితేటలను మీ విజ్నానమును మీ శక్తిని ఉపయోగించండి.అప్పుడే మనం మన దేశం మన కుటుంబం ప్రశాంతమైన జీవితానికి అవకాశం కల్గుతుంది.

ఉదా :-ఈ మద్య కాలంలో హుదూద్ తుఫాన్ మన దేశంలో చాలా అలజడి సృష్టించింది. అయితే మన ప్రపంచ దేశాలు చాలా మేదస్సుతో ముందు జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన హుదుద్ తుఫాను వలన ఎక్కువగా నష్టం కలగకుండా ఉండటానికి ఉపయోగపడింది. దీని ఫలితం ప్రపంచంలోని ఎందరో మేదావులు, విజ్నాన వంతలు తెలివితేటలతో శ్రమించి పనిచేసిన ప్రతి ఒక్కరికి దక్కుతుంది.

---- >ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొవడానికి ప్రతి పౌరుడు ముందుకు నడిచే మార్గమే వుద్యమం<-----